గంగులీ ఇక (అడ్మినిస్ట్రేటర్)పోరు జరిగేనా
1:20 AM Edit Thisభారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇక క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ అవతారం ఎత్తనున్నాడు. ఈ విషయాన్ని అతడు తన 37వ జన్మదినం సందర్బంగా తెలియజేశాడు. రిటౖౖెర్మెంట్ అనంతరం కూడా తాను క్రికెట్ టచ్‌లోనే ఉండాలనుకున్నట్లు చెప్పడం ఇంతక మునుపే జరిగింది . గత సంవత్సరం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై పలికిన గంగూలీ బుధవారంనాడు 37 ఏట అడుగు బెట్టాడు. గంగులీ ఆరునెలల క్రితం తాను క్రికెట్ ఆడడం ఆపివేశాడు, అయినప్పటికీ క్రికెట్‌కు టచ్‌లోనే ఉండాలని అనుకున్నాడు. బెంగాల్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లు ఎందరో ఉన్నారని , వారికి ప్రోత్సహం అందించేలా తాను కృషిచేయాలనుకుంటున్నట్లు భారత కెప్టెన్లలో ఎక్కువ విజయాలు అందుకున్న సారధిగా నిలిచిన అతడు మొదటి నుండి చెప్పకనే చెప్పడు . బెంగాల్ క్రికెట్ అసోపియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ దాల్మియాకు వ్యతిరేకంగా గంగూలీని దింపాలని ఇప్పటికే ప్రత్యర్థి వర్గం సన్నాహాలు చేస్తూ ఉంది. రోటేషన్ పాలసీ ప్రకారం 2014లో ఈస్టు జోన్‌కు బిసిసిఐ అధ్యక్ష పదవి లభిస్తుందని , అందువల్ల రంగంలోకి దిగాలని ఆ వర్గం చెబుతోంది. బిసిసిఐ అధ్యక్ష పదవిని దక్కించుకోవాలంటే గంగూలీ దానికి ముందు కనీసం బిసిసిఐ రెండు వార్షిక సమావేశాల్లోనైనా పాల్గొవల్సి ఉంది. ఈ క్రమంలో గంగూలీ బెంగాల్ క్రికెట్‌లో కీలకపాత్ర పోషించాలని అనుకుంటున్నాడు. మరోవైపు గంగూలీ బెంగాల్ క్రికెట్‌లో అడుగు బెడతాడని వస్తున్న వార్తలపై క్యాబ్ అధ్యక్షుడు జగన్మోహన్ దాల్మియా వద్ద ప్రస్తావించినప్పుడు ఇందులో తాను చెప్పేదేమీలేదన్నారు. దీనిపై మాట్లాడితే మరోవివాదానికి దారి తీసే వీలున్నందున తాను ఏమీ మాట్లాడనని వ్యాఖ్యానించారు.నిన్న మొన్నటిదాక గురువుగా భావించే తనపై పోటికి దిగాడా అని దిగ్బ్రంతి చెంది ఉంటాడు
ఇంత వరకు ఏ విషయం చెప్పకపోయిన మౌనం అర్దంగికారం అన్నట్టు చెప్పకనే చెప్పకొనివస్తున్నాడు