cinemavinodam

Error loading feed.

ధోని ఎవరికి భయపడడు

12:37 AM Edit This

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఎవరినైనా ప్రేమిస్తే తమతో చెప్పేందుకు భయపడడని ఆయన కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఇటీవల పలువురు బాలీవుడ్ హీరోయిన్‌లతో ధోనీ ప్రేమలో పడినట్లు మీడియాలో కథనాలు వెలువడిన నేపథ్యంలో ధోనీ కుటుంబ సభ్యులు ఈ వార్తలను ఖండించారు. ఒక వేళ ధోనీ ఎవరినైనా ఇష్టపడితే తమతో చెప్పడానికి ఏ మాత్రం సంకోచించడని తేల్చి చెప్పారు. అలాగే భాగస్వామి విషయంలో ధోనీకి పూర్తి స్వేచ్ఛ ఉందని వివరించారు. ఈ విషయంపై ధోనీ సోదరుడు నరేంద్ర మీడియాతో మాట్లాడారు. కుటంబ సభ్యులందరితోను ధోనీ చాలా సన్నిహితంగా ఉంటాడని.. అన్ని విషయాలు తమతో చెబుతాడని నరేంద్ర తెలిపారు. ప్రస్తుతం ధోనీకి పెళ్లికి ఇంకా సమయం ఉందన్నారు. ధోనీ కోసం పెళ్లి సంబంధాలు ప్రస్తుతం చూడటం లేదని నరేంద్ర తెలిపారు.