cinemavinodam

భారత్ ఆటగాళ్ళకు ఆస్ట్రేలియా ఆటగాళ్ళ ఎక్సెపిరియన్స్

10:52 PM Posted In Edit This
Matthew Hayden pulls powerfully over mid-wicket, India v Australia, 3rd Test, Delhi, 3rd day, October 31, 2008
ఆస్ట్రేలీయా ఆటగాళ్ళు ఒకరి తరువాత ఒకరు భారత్ ఆటగాళ్ళకు వారి ఎక్స్పిరియన్స్ పంచబోతున్నారు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టివా ఇప్పటికే కలకత్తాలో అకాడమి ఒపెన్ చేశా
డు ఇప్పుడు కొత్తగా ఆస్ట్రేలీయా మాజి డాషింగ్ ఓపెనర్ హేడెన్ చెన్నైలో అకాడమి ఓపెన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు దానికోసం ద్రావిడ్ ని ఐ.పి.యల్ లో కోచ్ గా చేసిన స్టివెన్ ఫ్లేమింగ్ ని సంప్రదించాడు.సౌతాఫ్రికాలో ఐ.పి.యల్ జరుగుతున్న సందర్భంలో హెడెన్ దీని గురించి ఆలోచించి రిటైర్మెంట్ తరువాత భారత్ లో అకాడమి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాట్టు ద్రావిడ్ కి తెలిపాడు చెన్నై లో మంచి ప్లేయర్స్ ఉన్నారని వారికి కొంచం కోచింగ్ ఇస్తే ఇంటర్నేషనల్ ఆటగాళ్ళుగా మారతారని చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా ఎప్పుడు నెంబర్:1 గానే ఉంటుందని కొత్త మంది మెయిన్ ప్లేయర్స్ ఒక్కసారిగా రిటైర్ అయ్యేసరికి మళ్ళీ స్తిరపడటానికి కొంత సమయం పడుతుందని చెప్పాడు ప్రతి టీం కి ఇటువంటి పరిస్తితి వస్తుందని అటువంటప్పుడు టీంలు కష్టపడాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు
ఆస్ట్రేలీయా వాళ్ళు భారత్ ఆటగాళ్ళ మీద పొగరుగా ప్రవర్తించడమే కాదండోయ్ వారి ఎక్స్పిరియన్స్ ని భారత్ ఆటగాళ్ళతో పంచుకోడానికి ఆసక్తి చూపుతున్నారు!