యాషెస్ సిరీస్ లో కష్టాల్లో ఇంగ్లాండ్
8:27 PM Edit This
యాషెస్ అనగానే మన భారత్ పాకిస్థాన్ ల మద్య జరిగే మ్యాచ్లా భావించే ఆస్ట్రేలియ,ఇంగ్లాండ్ మరో యాషెస్ లో పోటి పడుతు 4రోజులు దాటి ఐదోరోజు చేరుకునేలోగా ఇంగ్లాండ్ కు ఆస్ట్రేలియా పట్టుబిగించింది
నార్త్, హాడిన్ సెంచరీలు ః ఇంగ్లాండ్‌పై తమ తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీలు చేసిన వారిలో నార్త్ 15వ వాడు కాగా హాడిన్ 16వ బ్యాట్స్‌మన్. వీరిద్దరూ యాషెస్‌లోఆడడం ఇదే ప్రథమం. 2001 లో ఎడ్‌బాస్టన్‌లో డామియన్ మార్టిన్, గిల్‌క్రైస్ట్ ఈ ఘనతను సాధించిన తర్వాత మళ్లిద్ మరో ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆ ఫీట్ సాధించడం ఇదే. నార్త్ 242 బంతుల్లో 13 బౌండరీలు సాధించి 125 పరుగులతో అజేయంగా మిగలగా, హాడిన్ 151 బంతుల్లో 11 బౌండరీలు 3 సిక్సర్లతో 121 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఆరోవికెట్‌కు 200 పరుగులు జోడించారు. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ ః 435 (స్ట్రాస్ 30, బొపారా 35, పీటర్సన్ 69, కాలింగ్‌వుడ్ 64,మాట్ ప్రియర్ 56, ఫ్లింటాఫ్ 37, స్వాన్ నాటౌట్ 47, జాన్సన్ 3 వికెట్లు, ) ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ 6 వికెట్లకు డిక్లేర్ 674 (హ్యూజెస్ 36, కటిచ్ 122, పాంటింగ్ 150, క్లార్క్ 83, నార్త్ నాటౌట్ 125, హాడిన్ 121)
కార్డిఫ్ ః తొలి యాషెస్ టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఈ టెస్టును గెలుచుకునే యత్నంలో భాగంగా ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే రెండు వికెట్లు కూల్చింది. వర్షంతో అంతరాయం కలుగకుండా ఉంటే ఆస్ట్రేలియా నేటి నాలుగవ రోజు మ్యాచ్‌లో మరింత విజృంభించి ఉండేది. ఓపెనర్ బొపారాను కేవలం ఒక పరుగుకే హిల్పెన్‌హూస్ లెగ్‌బిఫోర్‌గా బలిగొనగా , కుక్‌ను 6 పరుగులకే జాన్సన్ అవుట్ చేశాడు. 17 పరుగులకే ఈ రెండు వికెట్లును కొల్పోయి ఇంగ్లాండ్ కష్టాల్లో పడిపోయింది. ఈ టెస్టుకు రేపటి ఆఖరి రోజు అయినందున ఇంగ్లాండ్ పై గెలిచే అవకాశాలు ఆస్ట్రేలియాకు ఉన్నాయి.
ఇన్నింగ్స్‌లో మొత్తం నలుగురు సెంచరీలు సాధించడంతో 674 పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఆతిథ్య జట్టుకంటే 238 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. కొద్దిలో మైఖెల్ క్లార్క్ సెంచరీ మిస్పయ్యాడు .లేదంటే ఈ ఇన్నింగ్స్‌లో సెంచరీలు సాధించిన వారి సంఖ్య ఐదుకు చేరి ఉండేది. మూడోరోజు ముగిసే సరికి వెలుతురు సరిగా లేక ఆట నిలిపివేసే సమయానికి 5 వికెట్లు నష్టపోయి 479 పరుగులతో ఉన్న ఆస్ట్రేలియాకు నార్త్ , హాడిన్ సెంచరీలు సాధించడంతో ఆరువందలను అధిగమించగలిగింది. వీరికి ముందు పాంటింగ్, కటిచ్ సెంచరీలు చేసిన విషయం విదితమే. వైస్‌కెప్టెన్ క్లార్క్ 83 పరుగుల వద్ద అవుట్ కావడంతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఐదో వికెట్‌కు నార్త్, క్లార్క్ కలిసి 143 పరుగులు జతకలుపగలిగారు. ఆ సమయంలో నార్త్ 54, బ్రాడ్ హాడిన్ 4 పరుగులతో ఉన్నారు. బ్రాడ్ బౌన్సర్‌ను హుక్ చేయడానికి ప్రయత్నించి క్లార్క్ కీపర్ ప్రియర్ అందుకున్న క్యాచ్‌తో తిరిగి వచ్చాడు. ఆపై నార్త్, హాడిన్ కలిసి పసలేని ఇంగ్లాండ్‌న సమర్థవంతంగా ఎదుర్కోగలిగారు. నార్త్‌కు అతడికెరీర్‌లో ఇది రెండో సెంచరీ. తొలిసారి యాషెస్‌లో ఆడుతున్న నార్త్ కు ఇంగ్లాండ్‌పై ఇదే మొదటిది. దీనికి ముందు అతడు దక్షిణాఫ్రికాపై సెంచరీ చేశాడు.