cinemavinodam

సంగక్కర వెనక్కు సచిన్

2:49 AM Edit This

టెస్ట్ క్రికెట్ లో టాప్ ఐ.పి.యల్ లో కొత్త వారికంటే తగ్గిపోయారు

2:29 AM Edit This

24వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సానియా మీర్జా

1:58 AM Posted In Edit This

భారత టెన్నిస్ స్టార్, హైదరాబాద్ బ్యూటీ సానియా మీర్జా సోమవారం నాడు 24వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రపంచ టెన్నిస్ రంగంలో భారత్‌కు సుస్థిర స్థానాన్ని సంపాదించిపెట్టిన సానియా మీర్జా, అనేక విజయాలతో పాటు గ్లామర్ రంగంలోనూ ఓ వెలుగు వెలుగుతోంది.

16వ ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు ప్రస్తుతం చైనాలోని గాంగ్జు నగరంలో ఉన్న సానియా మీర్జా తన తల్లి నసీమా, భర్త షోయబ్ మాలిక్, ఇతర కుటుంబ సభ్యులు, టెన్నిస్ సహచరుల సమక్షంలో సోమవారం నాడు జన్మదిన వేడుకలను జరుపుకుంది.
పెళ్లైనప్పటి నుండి ఎప్పుడూ వెన్నంటే ఉంటున్న భర్త మాలిక్ పుట్టిన రోజున కూడా పక్కనే ఉండటంతో సానియా హర్షం వ్యక్తం చేసింది. పెళ్లైన తర్వాత దేశ రాజధాని నగరంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన సానియా మీర్జా, ఆసియన్ గేమ్స్‌లోనూ మెరుగ్గా రాణించాలని భావిస్తోంది.

గాయంతో సతమతమవుతున్న జహీర్ ఖాన్

1:47 AM Posted In Edit This

కివీస్‌తో జరిగిన అహ్మదాబాద్, హైదరాబాద్ టెస్టులు డ్రా గా ముగిసిన నేపథ్యంలో, కీలక నాగ్‌పూర్ టెస్టుపై ఇరు జట్లు దృష్టి సారించాయి. తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల్లో గెలుపోటములు లేకుండా డ్రాతో సరిపెట్టుకున్న భారత్-కివీస్ జట్లు, చివరి టెస్టులో అమీతుమీ తేల్చుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. కానీ ఈ మూడో టెస్టుకు జహీర్ ఖాన్ దూరం కావడంతో టీమ్ ఇండియాకు ఆదిలో గట్టిదెబ్బ తగిలింది. గాయంతో సతమతమవుతున్న జహీర్ ఖాన్ స్థానంలో మరో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ జయ్‌దేవ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో మూడు ఓవర్లకు బంతులేసిన జహీర్ ఖాన్, గాయంతో అటు పిమ్మట బంతులేయలేదు. ఫలితంగా మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇషాంత్ శర్మ నాగ్‌పూర్ టెస్టులో బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

భారత్-కివీస్‌ల మధ్య హైదరాబాద్‌లో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది

5:28 AM Posted In Edit This

భారత్-కివీస్‌ల మధ్య హైదరాబాద్‌లో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. స్వల్ప ఓవర్లలో కివీస్ నిర్దేశించిన 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. సెహ్వాగ్ 54, గంభీర్ 14 పరుగులతో అజేయంగా నిలిచారు.

కానీ ఫలితం తేలే అవకాశాలు లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దీంతో అహ్మదాబాద్ టెస్టు తరహాలోనే హైదరాబాద్ రెండో టెస్టు కూడా గెలుపోటములు లేకుండా డ్రాగా ముగిసింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (54) 54 బంతుల్లో ఆరు బౌండరీలు, ఒక సిక్సర్‌తో సూపర్ అర్థసెంచరీని తన టెస్టు ఖాతాలో వేసుకున్నాడు. మరో ఓపెనర్ గౌతం గంభీర్ కూడా 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

అంతకుముందు కివీస్ తన రెండో ఇన్నింగ్స్‌ను 448/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 350 పరుగులు చేయగా, భారత్ 472 పరుగులు చేసింది. ఈ టెస్ట్‌లో భారత ఆటగాడు హర్భజన్, కివీస్ ఆటగాడు మెక్వింతోష్‌లు సెంచరీలు సాధించారు. డబుల్ సెంచరీ చేసిన న్యూజిలాండ్ ఓపెనర్ మెక్‌కల్లమ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. స్థానిక ఆటగాళ్లు వీవీఎస్ లక్ష్మణ్, ఓజాలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నగదు బహుమతులు ప్రదానం చేసింది.

ఈ సందర్భంగా టీమ్ ఇండియా కెప్టెన్ మాట్లాడుతూ.. "జహీర్ ఖాన్ గాయంతో తప్పుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ భుజానికి గాయం తీవ్రత తక్కువగా ఉండటంతో అతనిని బౌలింగ్‌కు ఉపయోగించుకోలేక పోయాం. కానీ సురేష్ రైనాను బౌలింగ్‌కు ఉపయోగించుకున్నాం. భజ్జీ బ్యాటింగ్ మంచి పరిణామమే.. అయితే అతనిపై ఆల్‌రౌండర్ కావాలని ఒత్తిడి తేవట్లేదు. నాగ్‌పూర్ టెస్టులో పిచ్ మాకు అనుకూలిస్తుందని నమ్ముతున్నాం." అని ధోనీ అన్నాడు.

కివీస్ కెప్టెన్ వెట్టోరి మాట్లాడుతూ.. డబుల్ సెంచరీ సాధించిన మెక్‌కల్లమ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. భారత గడ్డపై రెండో ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించడం చిన్న విషయం కాదన్నాడు.