24వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సానియా మీర్జా
1:58 AM Posted In Sania mirza shoaib malik Edit This
భారత టెన్నిస్ స్టార్, హైదరాబాద్ బ్యూటీ సానియా మీర్జా సోమవారం నాడు 24వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రపంచ టెన్నిస్ రంగంలో భారత్‌కు సుస్థిర స్థానాన్ని సంపాదించిపెట్టిన సానియా మీర్జా, అనేక విజయాలతో పాటు గ్లామర్ రంగంలోనూ ఓ వెలుగు వెలుగుతోంది.
16వ ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు ప్రస్తుతం చైనాలోని గాంగ్జు నగరంలో ఉన్న సానియా మీర్జా తన తల్లి నసీమా, భర్త షోయబ్ మాలిక్, ఇతర కుటుంబ సభ్యులు, టెన్నిస్ సహచరుల సమక్షంలో సోమవారం నాడు జన్మదిన వేడుకలను జరుపుకుంది. పెళ్లైనప్పటి నుండి ఎప్పుడూ వెన్నంటే ఉంటున్న భర్త మాలిక్ పుట్టిన రోజున కూడా పక్కనే ఉండటంతో సానియా హర్షం వ్యక్తం చేసింది. పెళ్లైన తర్వాత దేశ రాజధాని నగరంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన సానియా మీర్జా, ఆసియన్ గేమ్స్‌లోనూ మెరుగ్గా రాణించాలని భావిస్తోంది.