గాయంతో సతమతమవుతున్న జహీర్ ఖాన్
1:47 AM Posted In Zaheer khan Jayadev Team india kiwis 3test nagpur Edit This
కివీస్‌తో జరిగిన అహ్మదాబాద్, హైదరాబాద్ టెస్టులు డ్రా గా ముగిసిన నేపథ్యంలో, కీలక నాగ్‌పూర్ టెస్టుపై ఇరు జట్లు దృష్టి సారించాయి. తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల్లో గెలుపోటములు లేకుండా డ్రాతో సరిపెట్టుకున్న భారత్-కివీస్ జట్లు, చివరి టెస్టులో అమీతుమీ తేల్చుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. కానీ ఈ మూడో టెస్టుకు జహీర్ ఖాన్ దూరం కావడంతో టీమ్ ఇండియాకు ఆదిలో గట్టిదెబ్బ తగిలింది. గాయంతో సతమతమవుతున్న జహీర్ ఖాన్ స్థానంలో మరో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ జయ్‌దేవ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో మూడు ఓవర్లకు బంతులేసిన జహీర్ ఖాన్, గాయంతో అటు పిమ్మట బంతులేయలేదు. ఫలితంగా మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇషాంత్ శర్మ నాగ్‌పూర్ టెస్టులో బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.