టెస్టు ర్యాంకింగ్‌ల్లో భారత ఓపెనర్ గౌతంగంభీర్ నంబర్ వన్
9:44 PM Edit Thisఐసిసి టెస్టు ర్యాంకింగ్‌ల్లో భారత ఓపెనర్ గౌతంగంభీర్ నంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.2సంవత్సరల ముందు నుంచి అన్ని ఫార్మెట్ లలో రాణిస్తున్న గౌతం గంబీర్ టెస్ట్ లోను రాణిస్తు నెంబర్ వన్ స్థానానికి దీనికి ముందు ఈ ర్యాంకింగ్‌లో పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ యూసఫ్ ఉండగా తాజా ర్యాంకింగ్‌ల్లో ఆ స్థానం గంభీర్‌కు దక్కింది. అలాగే వన్డే ర్యాంకింగ్‌ల్లో కూడా భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. గల్లేలో సెంచరీ తర్వాత నంబర్ వన్‌కు చేరుకున్న యూసఫ్ రెండో టెస్టులో విఫలం కావడంతో దాన్ని పోగొట్టుకున్నాడు.అ తరువాత వెనువెంటనే ఉన్న గౌతం అ స్థానం దక్కించు కున్నాడు
కాగా ఇప్పటివరకు నంబర్ వన్‌కు చేరుకున్న భారత ఆటగాళ్ళలో గంభీర్ ఆరోవాడు. రాహుల్ ద్రావిడ్ తర్వాత ఈ ర్యాకింగ్‌ను అందుకున్న తొలి భారతీయ ఓపెనర్ గంభీరే. 2005 లో కోల్‌కతా టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసినప్పుడు (110, 135) ద్రావిడ్ ఈ నంబర్ వన్ ర్యాంకింగ్‌ను దక్కించుకున్నాడు.
.గంబీర్ టెస్ట్ రికార్డ్ :
Mat | Inns | NO | Runs | HS | Ave | BF | SR | 100 | 50 | 4s | 6s | Ct | St |
---|
Tests | 25 | 45 | 3 | 2271 | 206 | 54.07 | 4352 | 52.18 | 6 | 10 | 287 | 6 | 23 | 0 |