సచిన్ గురువు ఎవరంటే
7:33 AM Posted In [sachin][achrekar][vinod kambli] Edit Thisఈ రోజు తానీ స్థాయిలో ఉండటానికి కారణం తన గురువు కోచ్ రమాకాంత్. కోచింగ్ తనను క్రికెట్‌లో ఈ స్థాయికి ఎదిగేలా చేసింది.ఆయన ప్రోద్భలంతోను తనకు ఇంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.ఇవన్ని అన్నవి ఎవరో కాదండి ఎంతోమంది భారతీయులు ఆరద్యూడిగా భావించే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అన్నమాటలు ఇంతటి గొప్ప బ్య్యాట్స్ మెన్ అయిఉండి కూడ తన గురువుని మెచ్చుకొనే సంస్కారం ఉన్నది కాబట్టే లిటిల్ మాస్టర్ ద లెజెండ్ అయ్యాడు ఇదంతా ఎప్పుడంటే నాగ్‌పూర్‌లో గురువు అచ్రేకర్‌తో పాటు, తనకు, సచిన్ చిన్ననాటి స్నేహితుడు కాంబ్లీ తదితరులను ఓ సంస్థ సన్మానించింది. ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన సందర్బంగా సచిన్ మాట్లాడాడు. అచ్రేకర్ సర్ నుండి తాను ఎన్నో నేర్చుకున్నానన్నాడు. ఒకరి కోసం చప్పట్లు కాకుండా.. మన కోసం ఆటను ఆడాలని, మన బాధ్యతను నెరవేర్చాలని ఆయన చెప్పిన మాటలే తనను ఇప్పటికీ నడిపిస్తున్నాయన్నాడు.