skip to main
|
skip to sidebar
7:22 PM
Edit This
ఒకనాడు కలిసి పోటీచేసిన పేస్ జోడి, భూపతిలకు ఇలా ఎదురెదురు ప్రత్యర్థులుగా దిగాల్సి రావడం భలే తమషాగా ఉన్న ఇదే మొదటిసారి. గత సంవత్సరం యుఎస్ ఓపెన్ మిక్సెడ్ డబుల్స్ టైటిల్ అందుకున్న క్లారా - పేస్‌లు, భూపతి - సానియాపై పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించారు. పలు అనవసరపు తప్పిదాలు చేయడంతో భూపతి జోడికి పరాజయం తప్పలేదు. 13వ సీడ్ ఈ జోడి మొత్తం 9 అనవసరపు తప్పిదాలు చేసింది. అదే పేస్ జోడి చేసింది కేవలం ఒకటే. తొలిసెట్‌లో పేస్ , బ్లాక్‌లు 8 బ్రేక్ పాయింట్లు సాధించుకోగా ఇందులో రెండు విన్నర్స్‌గా మలుచుకోవడంతో 35 నిమిషాల్లో తొలి సెట్ ముగిసింది. అయితే రెండో సెట్‌లో కొంత పుంజుకున్న భూపతి జోడి ప్రత్యర్థులు ఎక్కువగా అనవసరపు తప్పిదాలు చేసేలా చేశారు. దీంతో 55 నిమిషాల్లో ముగిసిన రెండోసెట్‌ను వారు సాధించారు. ఈ క్రమంలో మూడో సెట్ అవసరం కాగా, పేస్ జోడి పుంజుకుని గెలిచింది. ఈసారి డబుల్ పాల్ట్స్‌ను ప్రత్యర్థులు చేయడం వీరికి కలిసొచ్చంది. దీంతో 37 నిమిషాల్లోనే ఈ సెట్‌ను అందుకోగలిగారు. కాగా క్వార్టర్ ఫైనల్‌లో పేస్- క్లారా , సుగియామా-అండ్రీ సా లేదా రాబర్ట్ లిండ్‌స్టెడ్- రెన్నెయి స్టబ్స్‌ను ఎదుర్కోవల్సి ఉంటుంది. .