ఆస్ట్రేలీయా ఆటగాళ్ళ కోచ్ ల స్వభావమే అటువంటిది:బజ్జీ
12:06 AM Posted In [Harbhajan Singh][Coach Buchanan's plan ][sunil gavaskar][sachintendulkar][india][australia] Edit This
సునీల్ గవాస్కర్,సచిన్ టెండూల్కర్ ల వంటి భారత క్రికెట్ వెటరన్స్ పై విమర్సలు చేసిన ఐపియల్ కోల్ కత్తా నైట్ రైడర్స్ మాజీ కోచ్,మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ జాన్ బుకానన్ పై విరుచుకు పడ్డారు. బుకానన్ వ్యాఖ్యలు తనకు ఆశ్చర్యం కలిగించలేదు,ఇలాంటి వాఖ్యలు చేయటం వారికి అలవాటు నేను అలవాటుపడి పోయాను ఆస్ట్రేలియా నుంచి వచ్చేవేవీ తనకు ఆశ్చర్యం కలిగించబోవు, తనను వారెంతగా ప్రేమిస్తున్నారో, తన గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో దీన్నిబట్టి అర్థమవుతోందని బజ్జీ తన బ్లాగ్ లో రాసుకున్నాడు.
తనపై ఆస్ట్రేలియన్లు తనపై ప్రశంసలు కురిపించడం ఇదే మొదటిసారి కాదని, తానే చివరివాడిని కూడా కాదని ఆయన వ్యంగ్యంగా అన్నాడు. గవాస్కర్, సచిన్ టెండూల్కర్ వంటి లెజెండ్స్ పై బుకానన్ చేసిన కల్పిత వ్యాఖ్యలే తనను బాధించాయని ఆయన అన్నారు. బుకానన్ కోచింగ్ నైపుణ్యాలను ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ కూడా సందేహించాడు, పైగా బుకానన్ కోచింగ్ నైపుణ్యాలు ఐపియల్ లో తెలిసిపోయాయని ఆయన అన్నారు.ఐదుగురి కెప్టెన్సి అనే కొత్త ఆలోచనే తెలుపుతుంది అతని కోచింగ్ ప్రతిభ అని అన్నాడు.