cinemavinodam
నిశ్చితార్దం తరువాత సానియ మొట్టమొదటగా టైటిల్
5:51 AM Edit This
నిశ్చితార్దం తరువాత సానియ మొట్టమొదటగా టైటిల్ గెలుచుకుంది. ఇండియా నుంచి ఐ.టి.యఫ్ చాలెంజర్ టోర్నిలో భరిలో ఉన్న సానియా టైటిల్ కైవసం చేసుకుంది ఆదివారం జరిగిన సెమిఫైనల్లో మెంగ్ యువాన్ ని ఖంగుతినిపించిన సానియా అదే విధంగా ఫైనల్లోను విజ్రభించి ఫ్రెంచ్ ఉమెన్ జూలీ కాయిన్ ని 7-6,7-5,6-4 తో జయించి టైటిల్ కైవసం చేసుకుంది మొదటి రెండు సెట్లలోను కొంచం కష్టపడిన మూడో సెట్లో 6-4తో సునాయాసంగా గెలిచింది 2003తరువాత ఇది తనకి రెండవది
చిన్న నాటి స్నేహితుడి పెళ్ళికి మాస్టర్ బ్లాస్టర్
1:38 AM Posted In [sachin][umar][cricket] Edit Thisనిన్న మొన్న మన రాష్టంలో వై.యస్.రాజశేఖర్ రెడ్డి తన చిన్న నాటి స్నేహితుడి పెళ్ళికి వెళ్ళినట్టు క్రికెట్లో ఎన్నో రికార్డులు సౄష్టించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తన చిన్న నాటి స్నేహితుడి పెళ్ళికి వెళ్ళాడు.తాను ఒక స్టార్ అనే సంగతి మరచి మారుమూల ప్రాంతమైన భట్కాల్ వెళ్ళాడు.తన బిజీ షెడ్యూల్ కాసేపు వదిలేసి తనతో చిన్నప్పుడు చదువుకున్న స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు ఉమర్ కి దుబాయ్ లో చెప్పుల ఫ్యాక్టరి ఉంది.ఇలాంటి స్వభావం ఉన్నవాడు గనకే సచిన్ గొప్ప క్రికెటరే కాదు గొప్ప వ్యక్తిత్వం ఉన్నావాడు కూడ.
భారత్ ఆటగాళ్ళకు ఆస్ట్రేలియా ఆటగాళ్ళ ఎక్సెపిరియన్స్
10:52 PM Posted In [hayden][dravid][steve waugh][fleming][india][chennai][ipl][kokatta][australia] Edit This
ఆస్ట్రేలీయా ఆటగాళ్ళు ఒకరి తరువాత ఒకరు భారత్ ఆటగాళ్ళకు వారి ఎక్స్పిరియన్స్ పంచబోతున్నారు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టివా ఇప్పటికే కలకత్తాలో అకాడమి ఒపెన్ చేశాడు ఇప్పుడు కొత్తగా ఆస్ట్రేలీయా మాజి డాషింగ్ ఓపెనర్ హేడెన్ చెన్నైలో అకాడమి ఓపెన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు దానికోసం ద్రావిడ్ ని ఐ.పి.యల్ లో కోచ్ గా చేసిన స్టివెన్ ఫ్లేమింగ్ ని సంప్రదించాడు.సౌతాఫ్రికాలో ఐ.పి.యల్ జరుగుతున్న సందర్భంలో హెడెన్ దీని గురించి ఆలోచించి రిటైర్మెంట్ తరువాత భారత్ లో అకాడమి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాట్టు ద్రావిడ్ కి తెలిపాడు చెన్నై లో మంచి ప్లేయర్స్ ఉన్నారని వారికి కొంచం కోచింగ్ ఇస్తే ఇంటర్నేషనల్ ఆటగాళ్ళుగా మారతారని చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా ఎప్పుడు నెంబర్:1 గానే ఉంటుందని కొత్త మంది మెయిన్ ప్లేయర్స్ ఒక్కసారిగా రిటైర్ అయ్యేసరికి మళ్ళీ స్తిరపడటానికి కొంత సమయం పడుతుందని చెప్పాడు ప్రతి టీం కి ఇటువంటి పరిస్తితి వస్తుందని అటువంటప్పుడు టీంలు కష్టపడాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు
ఆస్ట్రేలీయా వాళ్ళు భారత్ ఆటగాళ్ళ మీద పొగరుగా ప్రవర్తించడమే కాదండోయ్ వారి ఎక్స్పిరియన్స్ ని భారత్ ఆటగాళ్ళతో పంచుకోడానికి ఆసక్తి చూపుతున్నారు!
గంగూలీనే కెప్టెన్
2:23 AM Posted In [knight riders][sharukh][ganguly][john wright][bukaanan][2010season] Edit This
ఐ.పి.యల్ లో షారుఖ్ టీం ఫస్ట్ సీజన్ లో 7పాయింట్లతో మధ్యరకంగా ఉండిపోయింది దీనికి ఏదో ఒక రకంగా హిట్ చేయాలని నాన తంటాలు పడి కొత్త కొత్త ప్రయోగాలు చేసి సెకండ్ సీజన్ లో దింపాడు అనుకున్న దొకటి "అయినదొకటి అన్న విధంగా"ఫలితం తారుమారు అయ్యేసరికి మళ్ళీ మొదటకొచ్చి గంగూలీనే కెప్టెన్ గా ఎంచుకున్నాడు.సౌతాఫ్రిక సీజన్ లో చెత్త చెత్త గా ఆడించిన బుకానన్ ని కోచ్ గా తీసేసి అది వరకు ఇండియా టీం కి కోచ్ గా వ్యవహరించిన జాన్ రైట్ ని కోచ్ గా పెట్టేందుకు చూస్తున్నాడు గంగూలీ,షారుఖ్ ఇద్దరు డాక్టరెట్ లు తీసుకోవడానికి ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడుతు కోచ్ గా జాన్ బాగుంటడని గంగూలీ,నైట్ రైడర్స్ ఫ్రాన్ చేజీ ఒకతను జాన్ గురించి చెప్పారు తీసుకునేది లేనిది షారుఖ్ చేతిలో ఉంది.ఏది ఏమయినప్పటికి 2010 లో మంచి పర్ఫమెన్స్ ఇవ్వాలని చుస్తున్నారు
2011 అనంతరం వండేలకు రిటైర్మెంట్:చామింద వాస్
10:20 PM Posted In [srilanka cricket][chamindavaas][sangakkara][jayasurya][muralidaran] Edit Thisశ్రీలంక క్రికెట్ కి పేస్ బౌలర్ గా ఎన్నో సేవలందించిన చామింద వాస్ పాకిస్తాన్ తో జరిగిన మూడో టెస్ట్ అయినతరువాత అధికారకంగా రిటైర్మెంట్ ప్రకటించాడు సహచరులందరు నాకు ఎంతగానో సహకరించారని వండేలో 20-20లో ఇంకా నా సేవలు అందిస్తానని ఎంతో ఉద్వేగంతో చెప్పుకొచ్చాడు టెస్ట్ క్రికెట్ లో పాకిస్తాన్ తోనే అరంగేట్రం చేసిన వాస్ వాళ్ళతో ఆడిన టెస్టే చివరి టెస్ట్ అవడం ఎంతో ఆనందంగాఉందని శ్రీలంక టెస్ట్ క్రికెట్ నుంచి శ్రీలంకలో శ్రీలంక ప్రేక్షకుల ముందు రిటైర్ అవటం నాకెంతో సంతోషం కలిగిస్తోందని నేను వండేలు 20-20లో శ్రీలంకకి సేవలందిస్తానని 2011 అనంతరం వండేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పాడు.
మరోకొత్త రికార్డుతో మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్
8:39 AM Posted In [sachin][dhoni][viru][dravid][number 1][tax] Edit This
ప్రపంచ క్రికెట్‌లో ఉన్న రికార్డులు బద్దలుకొట్టడం, కొత్త రికార్డులు సృష్టించడం వంటివాటిలో అసమాన ఆటగాడు ఎదిగిన టీం ఇండియా మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ దేశంలో క్రికెటర్ల పన్ను చెల్లింపు జాబితాలోనూ నెంబర్‌వన్‌గా నిలిచాడు. చాలాకాలంగా టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాపార ప్రకటనలలో ద్వారా తన సహచరుల కంటే భారీ మొత్తాన్ని ఆర్జిస్తున్నట్లు తెలుస్తున్నప్పటికీ, పన్ను చెల్లింపుల్లోకి వచ్చే సరికి సచిన్ టెండూల్కర్ ఇతర క్రికెటర్ల కంటే ముందున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉండగా, టీం ఇండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మూడో స్థానంలో ఉన్నాడు. గత మూడేళ్లుగా సచిన్ టెండూల్కర్ ప్రతి ఏటా పన్ను రూపేణా ప్రభుత్వానికి రూ.8 కోట్లు చెల్లిస్తున్నాడు. గత ఏడాది క్రికెటర్ల పన్ను చెల్లింపుల్లో మూడో స్థానంలో ఉన్న రాహుల్ ద్రావిడ్ ఈ ఏడాది ఐదో స్థానంలో ఉన్నాడు
ఆస్ట్రేలీయా ఆటగాళ్ళ కోచ్ ల స్వభావమే అటువంటిది:బజ్జీ
12:06 AM Posted In [Harbhajan Singh][Coach Buchanan's plan ][sunil gavaskar][sachintendulkar][india][australia] Edit Thisసునీల్ గవాస్కర్,సచిన్ టెండూల్కర్ ల వంటి భారత క్రికెట్ వెటరన్స్ పై విమర్సలు చేసిన ఐపియల్ కోల్ కత్తా నైట్ రైడర్స్ మాజీ కోచ్,మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ జాన్ బుకానన్ పై విరుచుకు పడ్డారు. బుకానన్ వ్యాఖ్యలు తనకు ఆశ్చర్యం కలిగించలేదు,ఇలాంటి వాఖ్యలు చేయటం వారికి అలవాటు నేను అలవాటుపడి పోయాను ఆస్ట్రేలియా నుంచి వచ్చేవేవీ తనకు ఆశ్చర్యం కలిగించబోవు, తనను వారెంతగా ప్రేమిస్తున్నారో, తన గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో దీన్నిబట్టి అర్థమవుతోందని బజ్జీ తన బ్లాగ్ లో రాసుకున్నాడు.
తనపై ఆస్ట్రేలియన్లు తనపై ప్రశంసలు కురిపించడం ఇదే మొదటిసారి కాదని, తానే చివరివాడిని కూడా కాదని ఆయన వ్యంగ్యంగా అన్నాడు. గవాస్కర్, సచిన్ టెండూల్కర్ వంటి లెజెండ్స్ పై బుకానన్ చేసిన కల్పిత వ్యాఖ్యలే తనను బాధించాయని ఆయన అన్నారు. బుకానన్ కోచింగ్ నైపుణ్యాలను ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ కూడా సందేహించాడు, పైగా బుకానన్ కోచింగ్ నైపుణ్యాలు ఐపియల్ లో తెలిసిపోయాయని ఆయన అన్నారు.ఐదుగురి కెప్టెన్సి అనే కొత్త ఆలోచనే తెలుపుతుంది అతని కోచింగ్ ప్రతిభ అని అన్నాడు.ప్రపంచ క్రికెట్లో ప్రముఖ పొట్టి బ్యాట్స్‌మెన్
6:39 AM Posted In batsman , cricket batsman , lords cricket ground , tendulkar Edit This
డాన్ బ్రాడ్మన్ – 5 అడుగుల 6-3 / 4 అంగుళాలు విజయ్ మర్చంట్ – 5 అడుగుల 7 అంగుళాలు. బ్రియాన్ లారా -5 అడుగుల 8 అంగుళాలు రాయ్ డయాస్ – 5 అడుగుల 6 అంగుళాలు అరవింద డిసిల్వా – 5 అడుగుల 4 అంగుళాలు సునీల్ గవాస్కర్ – 5 అడుగుల 4-3 / 4 అంగుళాలు సచిన్ టెండూల్కర్ 0 – 5 అడుగుల 4 అంగుళాలు జి. విశ్వనాథ్ – 5 అడుగుల 4-1 / 2 అంగుళాలు రాయ్ ఫ్రెడ్సిక్స్ – 5 అడుగుల 4 అంగుళాలు.
నీకు వైద్యం చేయను పో.
6:36 AM Posted In akram , doctor , pakistani bowlers , shoyab aktar Edit Thisపాపం! పాకిస్తాన్ వివాదాస్పద బౌలర్ షోయబ్ అక్తర్‌కు శస్త్ర చికిత్స చేసేందుకు వైద్యుడు కూడా మొండి చెయ్యి చూపారు. అడుగడుగునా వివాదాల పుట్టలో వేలు దూరుస్తున్న అక్తర్‌కు శస్త్ర చికిత్స చేయడం ద్వారా తనకు ఇప్పటికే ఉన్న మంచిపేరు చెడగొట్టుకోలేనని ఆ డాక్టర్ అన్నాడట.
దేశంలోనే గొప్ప సర్జన్‌గా తనకు పేరుందని, అంతర్జాతీయ కెరీరంతా వివాదాలతో గడిపిన నీలాంటి వాడికి శస్త్ర చికిత్స చేసి నాకున్న మంచి పేరును చెరిపి వేసుకోలేనని అక్తర్‌కు డాక్టర్ స్పష్టం చేసినట్లు పిసిబి అధికారి ఒకరు తెలిపినట్లు ప్రముఖ పాకిస్తానీ పత్రిక జంగ్ పేర్కొంది. మోకాలి గాయం నుంచి కోలుకోవాలంటే శస్త్ర చికిత్స చేసుకోవలసిందేనని పిసిబి వైద్యులు గతంలో అక్తర్‌కు సూచించిన విషయం తెలిసిందే. |
ద టీం అల్ వెస్ నెం .1
11:29 PM Posted In [ashes]ricky ponting][andrew strauss][michael clark][haddin] Edit This130/5 వికెట్లు కోల్పోయి కష్ఠాలోపడ్డారు
అటువంటి స్తితి నుంచి వైస్ కెప్టెన్ క్లార్క్,కీపర్ హద్దిన్ అద్బుత పార్టనర్ షిప్
తో ఆస్ట్రేలీయా విజయానికి ఆశలు సజీవం చేశారు ఎలాంటి కష్ట సమయాలలోనైన 6 బ్యాట్స్ మెన్ అయినా 7 వాడైన కష్టలో రాణిస్తారుగనకే నెం వన్ టెస్ట్ టీం గా నిలిచింది
ఇలాంటి కష్టలలో అదుకుంటాడ్ గనకే క్లార్క్ ఆస్ట్రేలీయా వైస్ కెప్టెన్ అయ్యాడు
సచిన్ గురువు ఎవరంటే
7:33 AM Posted In [sachin][achrekar][vinod kambli] Edit Thisఈ రోజు తానీ స్థాయిలో ఉండటానికి కారణం తన గురువు కోచ్ రమాకాంత్. కోచింగ్ తనను క్రికెట్‌లో ఈ స్థాయికి ఎదిగేలా చేసింది.ఆయన ప్రోద్భలంతోను తనకు ఇంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.ఇవన్ని అన్నవి ఎవరో కాదండి ఎంతోమంది భారతీయులు ఆరద్యూడిగా భావించే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అన్నమాటలు ఇంతటి గొప్ప బ్య్యాట్స్ మెన్ అయిఉండి కూడ తన గురువుని మెచ్చుకొనే సంస్కారం ఉన్నది కాబట్టే లిటిల్ మాస్టర్ ద లెజెండ్ అయ్యాడు ఇదంతా ఎప్పుడంటే నాగ్‌పూర్‌లో గురువు అచ్రేకర్‌తో పాటు, తనకు, సచిన్ చిన్ననాటి స్నేహితుడు కాంబ్లీ తదితరులను ఓ సంస్థ సన్మానించింది. ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన సందర్బంగా సచిన్ మాట్లాడాడు. అచ్రేకర్ సర్ నుండి తాను ఎన్నో నేర్చుకున్నానన్నాడు. ఒకరి కోసం చప్పట్లు కాకుండా.. మన కోసం ఆటను ఆడాలని, మన బాధ్యతను నెరవేర్చాలని ఆయన చెప్పిన మాటలే తనను ఇప్పటికీ నడిపిస్తున్నాయన్నాడు.
బోరింగ్ టెస్ట్ నుంచి వాస్ వెళ్లిపోయాడు
3:12 AM Posted In [srilanka test cricket][chamindavaas][kumarasangakkara][pakistan team] Edit Thisటెస్ట్ లు బోరింగ్ గా ఉన్నయా అంటే ప్రేక్షకులకు ఉన్నాయో లేదో తెలీదుగాని ఆటగాళ్ళకు మాత్రం బోరింగ్ గా ఉన్నట్టు ఉంది ఒకరి తరువాత ఒకరు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు నిన్న ఫ్లింటాఫ్ ఈ రోజు శ్రీలంక బౌలర్ చామింద వాస్ రిటైర్మెంట్ ప్రకటించాడు ఫ్లింటాఫ్ యాషెస్ తరువాత రిటైర్ అయితే వాస్ పాకిస్థాన్ తో జరిగే టెస్ట్ అనంతరం రిటైర్ అవుతాని ప్రకటించాడు రిటైర్ మెంట్ ప్రకటిస్తే మొత్తం ఇంటర్నేషనల్ క్రికెట్ కి మన గంగూలీ, కుంబ్లే లా మొత్తం క్రికెట్ కి రిటైర్ కావలికాని ఓన్లి టెస్ట్ క్రికెట్ కి ఇచ్చి వండే 20-20లు ఇవ్వకుండ ఉంటున్నారు అంటే వండే లో 20-20లో డబ్బులు వస్తున్నాయ్ కాబట్టి టెస్ట్ లో ఆడేదెక్కువ డబ్బు తక్కువ అంత సేపు ఆడిన డ్రా తప్ప ఫలితం తేలకపోవడం వారికి విసుగు తెప్పిస్తున్నట్టుంది.అందుకే ఈ అర్దంతర నిర్ణాయాలు
ట్వంటీ--20 టెస్ట్ మ్యాచ్ ?20-20 ఫార్మెట్ లో రెండో ఇన్నింగ్స్
1:17 AM Posted In [Testmatch][ICC][All country's] Edit Thisట్వంటీ20 టెస్ట్ మ్యాచ్ జరిగితే ఎలా ఉంటుంది? వినటానికి అదోలా ఉన్నప్పటికీ భవిష్యత్తులో అది నిజం కానుంది. ట్వంటీ20 ఎదురుదాడి నుంచి టెస్ట్ క్రికెట్ను కాపాడుకునే దారులను ఐసీసీ వెదుక్కుంటున్న తరుణంలో రెండు ఇన్నింగ్స్తో ట్వంటీ 20 కొత్త ఫార్మెట్ మొదలుపెట్టబోతోంది టెస్ట్ క్రికెట్ ఉణికిని కాపాడటానికి ఐ.సి.సి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తోంది 20-20 ఫార్మెట్ లో రెండో ఇన్నింగ్స్ పెట్టాలనే ఆలోచనలోఉంది ఇదే కాదు టెస్ట్ క్రికెట్ లో డెయ్ ఎండ్ నైట్ టెస్ట్ల ప్రయోగం ఆల్ రెడీ ఇంగ్లాండ్ లో మొదలుపేట్టరు ఇందులో ఆడే బంతి తెలుపురంగులో ఉంటుంది ఇవి గనక మంచి ఫలితానిస్తే వచ్చే సంవత్సరం నుండి ఇంటర్నేషనల్ క్రికెట్ లో మొదలు పెడతారు ఇదంత జరగడానికి కొంత సమయంపడుతుంది అంతవరకు టెస్ట్ ని కాపాడటనికి క్రికెట్ బ్యాట్స్ మెన్ బౌలర్లు కొంచం బుద్దిపెట్టాలి లేనిచో ఈ కొద్దికాలంలోనే టెస్ట్ ఉణికిపోతుంది.
సెహ్వాగ్ ద్వారనే నెం.1
5:29 AM Edit Thisఇది తనే స్వయంగా గౌతం అన్నమాట"అంతా వీరూ దయ" మన టీం ఇండియా లోని ప్రతి ఆటగాడు సచిన్ లేదా గంగూలీ తనకు స్పూర్తినిచ్చిన ఆటగాడని చెప్పుకుంటుంటే టెస్ట్ లో నెం:1 స్తానాన్ని చేజిక్కించుకున్న గంబీర్ మాత్రం నాకు అంత సెహ్వాగే అంటున్నాడు తనని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు అవతలి ఎండ్ లో సెహ్వాగ్ ఉంటే ఎటువంటి బ్యాట్స్ మెన్ కయినా అసలు ప్రెషర్ ఉండదని.నా టెక్నిక్ మొదట్లో అసలు బాగలేదని అందరు అంటుంటే తను నాకు సలహాలు ఇచ్చి నా బ్యాటింగ్ ని ఎంతగానో మెరుగుపరచాడని నేను నెంబర్ వన్ లో ఉన్నానంటే సెహ్వాగ్ యే కారణమని చెప్పుకొచ్చాడు నన్ను మొదట్లో టెస్ట్ లకి పనికిరావన్నారు అప్పటినుంచి కౄషితో ఈ స్థానానికి చేరేను ఇండియా టీం లో ఉండాలంటే చాల కౄషి చేయాల్సి ఉంటుంది అందుకు నా వరకు నేను మెరుగ్గ రాణిస్తాను ఇండియా టీం నె:1స్తానానికి వచ్చేదాక టీంతో బాటు కౄషి చేస్తానని చెప్పాడు
సచిన్ పై ప్రశ్నలో కాంబ్లి ఏడ్చడు
1:32 AM Edit Thisసచిన్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లి "తనకు చేయాల్సిన సహయం చేయలేదని" చేసిన వివాదస్పద వ్యాఖ్య నేను చేయలేదని వినోద్ కాంబ్లి చెపుతున్నా అ వార్త మాత్రం అతని వదిలేలాలేదు ఓ రియాల్టి షో లో సచిన్ పై చేసిన ఈ వాఖ్య అందరిని విస్మయపరిచింది ఇలాంటి వార్తలని విడిచిపెట్టని మీడియా వారు ఆ షో నిర్వహాకుడిని పట్టుకొని ఈ ప్రశ్న విషయం అడుగగా ఈ ప్రశ్న ఆ షొలో ఉందని.ఈ ప్రశ్నకు జవాబు చెప్పేటప్పుడు వినోద్ కాంబ్లి ఏడ్చడని షో నిర్వహకుడు రాజీవ్ ఖండేవాల్ ఓ టి.వి.వారికి చెప్పాడు ఇదంతా నిజమో కాదో తెలియాలంటే ఆ ఎపిసొడ్ చూడాలి మరి.