వివిధ రకాల పరిస్థితుల కారణంగా తాము ఫీల్డింగ్‌లో బలహీనంగా ఉన్నo
3:57 AM Edit This
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు జట్టుతో సహా జొహెన్నెస్‌బర్గ్ చేరిన సందర్భంగా ధోనీ మాట్లాడాడు. ఎక్కువగా కష్టపడినంత మాత్రాన ఒక్క రోజులోనే తాము ప్రపంచ ఛాంపియన్లం అయిపోలేమన్నాడు. దేనికైనా సమయం పడుతుందని.. అయితే ఇందుకు జట్టంతా సమిష్టిగా రాణిస్తూ.. ఫీల్డింగ్‌లో మేలైన ఫలితాలు సాధించాలన్నాడు.
వివిధ రకాల పరిస్థితుల కారణంగా తాము ఫీల్డింగ్‌లో బలహీనంగా ఉన్న మాట వాస్తవమేనని ధోనీ అంగీకరించాడు. అయితే.. ఆస్ట్రేలియాలో 2007లో పర్యటించిన జట్టుకు ఇప్పటి జట్టుకు వ్యత్యాసం చాలా ఉందన్నాడు. తనకు వన్డేలంటే మహా ఇష్టమని.. ట్వంటీ20ల వల్ల వన్డేలు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందనే విషయాన్ని ఖండించాడు. పరస్థితులకు అనుగుణంగా అన్ని ఫార్మాట్‌లు ఆడాలన్నాడు.