cinemavinodam

వెస్టిండిస్ ని తక్కువంచనా వేస్తున్న పాంటింగ్

9:24 AM Edit This
ఛాంపియన్స్ ట్రోఫీలో వెస్టిండీస్ బోర్డు బలహీనమైన జట్టును బరిలో నిలపడంపై ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీతోపాటు, తరువాత స్వదేశంలో జరిగే క్రికెట్ సిరీస్‌కు కూడా బోర్డు ఇదే జట్టును పంపుతుందేమోనని అనుమానపడ్డాడు. ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీలో తన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తోనే తలపడనుంది.

వెస్టిండీస్ ప్రధాన ఆటగాళ్లను కాంట్రాక్టు వివాదం కారణంగా ఆ దేశ బోర్డు పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి విండీస్ బోర్డు ద్వితీయ శ్రేణి జట్టును పంపింది. పాకిస్థాన్‌తో బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లోనే వెస్టిండీస్ ఆటగాళ్ల బలహీనతలు స్పష్టంగా బయటపడ్డాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ సంగతి పక్కనపెడితే, నవంబరులో ఆస్ట్రేలియా క్రికెట్ సీజన్‌ను వెస్టిండీస్ జట్టుతోనే ప్రారంభించబోతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో రీఫెర్ నేతృత్వంలోని వెస్టిండీస్ జట్టును గౌరవిస్తామని, విండీస్‌లో కాంట్రాక్టు వివాదం సద్దుమణగకపోతే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఈ జట్టుతోనే ఆడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నామని పాంటింగ్ చెప్పాడు.