ధొని బి.కాం తప్పెడు
8:53 PM Edit This
మైదానంలో తన అనూహ్యమైన ఎత్తులతో ప్రత్యర్థి జట్లను చిత్తుచేసి జట్టుకు అపురూపమైన విజయాలు అందించే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం చదువుల్లో విఫలం అవుతున్నాడు. బికాం డిగ్రీ పార్ట్-1 పరీక్షల్లో ధోనీ కృతార్ధుడు కాలేకపోయాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల కారణంగా గత జులై నెలలో పరీక్షలకు హాజరుకానప్పటికీ ధోనీ ఫెయిల్ అయినట్లు పరీక్షాఫలితాల్లో ప్రకటించారు. జరిగిన తప్పును గ్రహించిన జేవియర్ కళాశాల అధికారులు నోటీసు బోర్డు నుండి పరీక్షా ఫలితాల జాబితాను ఆదరాబాదరాగా తొలగించారు. క్లరికల్ ఎర్రర్ కారణంగా ఫలితం ప్రకటించారని, పరీక్షలకు హాజరుకానివారు ఎలా ఫెయిల్ అవుతారని కళాశాల ప్రిన్సిపాల్ ప్రశ్నించారు. దాదాపు దశాబ్దం క్రితం పాఠశాల విద్యను పూర్తిచేసి మహేంద్ర సింగ్ ధోనీ గత ఏడాది కళాశాలలో చేరాడు.