cinemavinodam

ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రతీకారం తీర్చుకుంటా

10:54 AM Edit This
2003 ప్రపంచ కప్‌లో భారత్ చేతిలో ఎదురైన పరాభవానికి ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ యూనిస్ ఖాన్ చెప్పాడు. ఆ రోజు కోసం తామంతా ఎదురు చూస్తున్నట్టు యూనిస్ చెప్పాడు. ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఎనిమిది దేశాల ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దాయాది దేశాలైన పాకిస్థాన్, భారత్‌లు ఈనెల 26వ తేదీన తలపడనున్నాయి.

దీనిపై యూనిస్ ఖాన్ స్పందిస్తూ.. 2003 ప్రపంచ కప్‌లో తాము 270 పరుగులు చేసినప్పటికీ ఓటమి పాలయ్యాం. ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్‌లు రెచ్చిపోవడంతో 270 విజయలక్ష్యం చిన్నబోయింది. వీరికితోడు రాహుల్ ద్రావిడ్, యువరాజ్ సింగ్‌లు రాణించారు. ఫలితంగా తాము ఓటమి చవిచూశాం.

ఈ ఓటమి తమను ఎంతగానే బాధించింది. దీన్ని ఇంకా మరచిపోలేక పోతున్నాం. ఇది తమను ఇంకా వేధిస్తోంది. దీనికి ప్రతీకారం తీర్చుకునే రోజు కోసం వేచి చూస్తున్నాం అని యూనిస్ ఖాన్ అన్నాడు.