ఈ రోజు భారత్ మ్యాచ్ రివ్యు
10:58 AM Edit This
శ్రీలంకాలో మొదలయిన వండేలలో భారత్ భొణీ మొదలయింది న్యూజిలాండ్ పై భారత్ గెలిచి నెం:1 స్థానానికి అడుగేసింది



డై యండ్ నైట్ ప్లెడ్ లైట్ల వెలుతురు మధ్య జరిగిన ఈ మ్యాచ్లో భారత్ గెలిచింది న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ దిగి భారత్ బౌలర్ల ముందు నిలవలేక పోయింది యువరాజ్,నెహ్ర లు న్యూజీలాండ్ బ్యాటింగ్ లైనప్ ని కోలుకోలేని దెబ్బతీశారు (నెహ్ర 3-24, యువరాజ్ 3-31) మొత్తం 10 వికెట్లలో విరివురే 6 వికెట్లు తీశారు భారత్ ఈ మ్యాచ్ ని సునాయాసంగ కాక పోయిన టెన్షన్ లేకుండా 6 వికెట్లు మిగిలి ఉండగానే గెలిచింది 156 పరుగుల చిన్న లక్ష్యమైన పిచ్ అంత బాగ లేనందున కొంచం ఆచి తుచి ఆడవల్సివచ్చింది అందుకే 40 ఓవర్లు పట్టింది ఈ మ్యాచ్ లో స్పష్టంగా కనపదిందేమిటంటే ఓపెనర్స్ లోపం ఎందుకంటే తక్కువ స్కొర్ చేజ్ చేసేటప్పుడు ముందుగానే వికేట్ కొల్పోకూడదు మొదట్లోనే కార్తిక్ వికెట్ కొల్పొయే సరికి భారమంత సచిన్ పై పడింది.సచిన్ దానిని ఎంతో సమర్దంగా ఎదుర్కొన్నాడు[మాస్టర్ బ్లాస్టర్ గా మరి]తనదైన శైలిలో బౌండరిలు కొడుతు ద్రావిడ్ పై ఒత్తిడి తగ్గించాడు అతను ఎంత సునాయాసంగా షాట్లు కొట్టేడో అంతే సులభంగా ఔట్ అయ్యాడు ద్రావిడ్ మాత్రం తనదైన శైలిలో మరొ వికెట్ పడకుండా ఆచి తూచి ఆడాడు వారివురు రెండో వికెట్ కి మంచి పార్టనర్ షిప్ ఇచ్చి స్కొర్ ని కదిలించారు మ్యాచ్ భారత్ చేతులలో కి వస్తోంది అనగ వరుసగ 3వికెట్లు కొల్పొవడంతో కొంచం టెన్షన్ వచ్చిన కెప్టన్ ధొని -సురెష్ రైనాలు ఎటువంటి టెన్షన్ పెట్టకుండా భారత్ ని గెలిపించారు ధొని 36 రైనా 45 తో నాటౌట్ నిలిచారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ని ఆశిష్ నెహ్ర అందుకున్నాడు ఈ మ్యాచ్లో గెలుపుతో భారత్ ఫైనల్ కి చేరుకుంది ఫైనల్ కి చేరుకోవడం ఎంత ముఖ్యమో మిగిలిన మ్యాచ్ లు గెలవటం అంతే ముఖ్యం రేపు రెండు గంటలకు భారత్ - శ్రీలంక ల మధ్య మూడో వండే