cinemavinodam

కొనసాగుతున్న చెంపదెబ్బల పర్వం[హర్భజన్]

10:44 AM Edit This
హర్భజన్ సింగ్ మెడచుట్టూ మరో వివాదం చుట్టుకుంది. భారత జట్టు బుధవారం శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్ ఆడేందుకు బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అక్కడికి వెళ్లే కొన్ని నిమిషాల ముందు భజ్జీ మరో వివాదాన్ని సృష్టించాడు. బెంగళూరు విమానాశ్రయంలో హర్భజన్ సింగ్ ఓ కెమేరామెన్‌పై చేయిచేసుకున్నట్లు తెలుస్తోంది.హర్భజన్ తనతటతానుగానే వివాదాలలో చిక్కుకొని తన కెరీరె తనే దెబ్బ తీసుకుంటున్నాడు అతను కొంచం హోదాగా ప్రవర్తిస్తే నిషేదాలకు లోను కాకుండా ఉంటాడు కాని అతను అది మరచి పదేపదే తప్పిదం చేసి మీడియా భారిన పడుతున్నాడు మరొకసారి మిడియా ముందుకొచ్చాడు పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధుల నడుమే ఈ వ్యవహారం జరిగింది. విమానాశ్రయంలోకి అడుగుపెట్టే ముందు కారు నుంచి లగేజీ తీసుకుంటున్న హర్భజన్ సింగ్‌కు తలపై సదరు వ్యక్తి కెమేరా తగిలింది.కొంచం ఓర్పుతో ప్రవర్తించలేదు కోపం దీంతో హర్భజన్ సింగ్ అతనిపై చేయి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే గతంలోనూ హర్భజన్ సింగ్ తన సహచరుడు శ్రీశాంత్‌పై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే ఇలా ఒకటితరువాత ఒకటి చేసుకుంటు పోతే ఆస్ట్రేలియా సైమండ్స్ ల పొగరుబోతుగా ముద్రపడి పోతుంది